సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ

by  |
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ
X

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. ఈ నెల 24న సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణస్వీకారం తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను గతనెల ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సీజేఐగా ఎన్‌వీ రమణ సుమారు ఏడాదిపై నాలుగు నెలలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2022 ఆగస్టు 26న జస్టిస్ రమణ రిటైర్ కాబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు తీసుకున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ రికార్డుల్లో నిలవనున్నారు.

Next Story

Most Viewed