భారీ వరదలతో నిండుకుండలా జూరాల

by  |
భారీ వరదలతో నిండుకుండలా జూరాల
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 9.657 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు ఆదివారం నాటికి దాదాపు పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరిగింది. వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతూ.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 79,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదయింది. దీనితో అధికారులు మొత్తం 6 యూనిట్లకు గాను ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దిగువకు 1,1419 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకు నీటి ప్రవాహం పెరిగిపోతున్న నేపథ్యంలో కృష్ణా నది తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో జూరాలకు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కోయిల్ సాగర్, భీమ, నెట్టెంపాడు ప్రాజెక్టులకు జూరాల నుంచి నీటిని లిఫ్ట్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. వరద ఇలాగే కొనసాగితే జూరాల పై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, చెరువులు కుంటలు అన్ని నిండి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.

Next Story

Most Viewed