ఆగనంటున్న కృష్ణమ్మ.. జూరాల 12 గేట్లు ఎత్తివేత

by  |
ఆగనంటున్న కృష్ణమ్మ.. జూరాల 12 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 83,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 86,673 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుత నీటిమట్టం 318.420 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657టీఎంసీలుగా ఉంది. జూరాల నిండుకుండలా మారడంతో అధికారులు అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed