ఉమ్మ‌డి ఖ‌మ్మం సేఫ్..

by  |
ఉమ్మ‌డి ఖ‌మ్మం సేఫ్..
X

దిశ‌, ఖ‌మ్మం: దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఉధృత‌మ‌వుతున్న వేళ‌.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ క్ర‌మంగా విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని మ‌ర్క‌జ్‌కు వెళ్లొచ్చిన వారు ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోనూ ఉండ‌టంతో ఆయా జిల్లాల్లో హై టెన్ష‌న్ వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు తీవ్రభయాందోళలకు గురయ్యారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మ‌ర్క‌జ్‌కు వెళ్లొచ్చిన వారితో పాటు క‌రోనా ల‌క్ష‌ణాలున్న మొత్తం 10మందిని మ‌ణుగూరులోని క్వారంటైన్‌కు అధికారులు త‌ర‌లించారు. అనంతరం వారికి కరోనా టెస్ట్‌లు చేయగా, నెగ‌టివ్ వ‌చ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎం.వి రెడ్డి తెలిపారు. ఇక ఖ‌మ్మం జిల్లాలోనూ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో 564 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నారనీ, వీరిలో 534 మంది ఇళ్ల‌లోనే క్వారంటైన్ పాటిస్తున్న‌ట్లు జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారి మాల‌తి తెలిపారు. ఈ మేరకు క‌రోనా వ్యాధి వ్యాప్తి, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై గురువారం సాయంత్రం ఆమె హెల్త్ బులెటెన్ విడుద‌ల చేశారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో 30 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్న‌ట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులో మొత్తం 858 మంది ఓపి, 125 మంది ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స పొందుతున్న‌ట్లు చెప్పారు. అలాగే, మ‌రో 46 మంది మమత జనరల్ ఆసుపత్రిలో క‌రోనా ల‌క్ష‌ణాల‌తో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 111మందికి నెగటివ్ రాగా, ఇక మిగ‌తా ఆరుగురి రిపోర్టులు రావాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి వెళ్లొచ్చిన వారంద‌రికీ నెగ‌టివ్ వ‌చ్చింద‌ని స్పష్టం చేశారు. క‌రోనాపై ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని అన్నారు.

tags: corona cases in khammam, joint khamma, bhadradri kothagudem, malathi, delhi markaz, collector mv reddy,

Next Story