ఇకపై ప్రతీ ఏడాది టెట్.. త్వరలో నోటిఫికేషన్ !

by Disha Web Desk 17 |
ఇకపై ప్రతీ ఏడాది టెట్.. త్వరలో నోటిఫికేషన్ !
X

దిశ, కెరీర్: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)ను ఇకపై ఏటా ఒకసారి తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాది జూన్‌ 12న టెట్‌ నిర్వహించామని.. ఏడాది కావడంతో మరోమారు ఈ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT) రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. దీంతో ఒక సారి అర్హత సాధించిన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాయడానికి ఆసక్తి చూపుతుంటారు.



Next Story

Most Viewed