BARCలో భారీగా ఉద్యోగాల భర్తీ.. రూ. 50 వేలకు పైగా జీతం

by Disha Web Desk 17 |
BARCలో భారీగా ఉద్యోగాల భర్తీ.. రూ. 50 వేలకు పైగా జీతం
X

దిశ, కెరీర్: భారత అణుశక్తి విభాగానికి చెందిన భాబా అణు పరిశోధనా కేంద్రం.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

టెక్నికల్ ఆఫీసర్ (సి) - 181

సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) - 7

టెక్నీషియన్ (బి) - 212

ట్రైనింగ్ స్కీం (స్టైపెండరీ ట్రైనీ):

కేటగిరీ - 1 : 1216

కేటగిరీ - 2 : 2946

మొత్తం పోస్టులు : 4,162

స్టైపెండ్: నెలకు కేటగిరీ - 1 కి రూ. 24,000 నుంచి రూ. 26,000

కేటగిరీ -2 కు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు ఉంటుంది.

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:

మే 22, 2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్ కు 18 నుంచి 35 ఏళ్లు

సైంటిఫిక్ అసిస్టెంట్ కు 18 నుంచి 30 ఏళ్లు

టెక్నీషియన్ కు 18 నుంచి 25 ఏళ్లు

స్టైపెండరీ ట్రైనీ కేటగిరీకి 19 నుంచి 24 ఏళ్లు

కేటగిరీ -2కు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు టెక్నికల్ ఆఫీసర్లకు రూ. 56,100

సైంటిఫిక్ అసిస్టెంట్ లకు రూ. 35, 400

టెక్నీషియన్ పోస్టులకు రూ. 21, 700 ఉంటుంది.

ఎంపిక: ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

టెక్నికల్ ఆఫీసర్‌‌‌‌‌కు రూ. 500

సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ. 150

టెక్నీషియన్‌కు రూ. 100

కేటగిరీ - 1కు రూ. 150

కేటగిరీ 2 కు రూ. 100

ఎస్టీ/ఎస్టీ, దివ్యాంగులకు,మహిళలకు ఫీజు లేదు.

పరీక్షా కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 24, 2023.

చివరి తేదీ: మే 22, 2023.

వెబ్‌సైట్: https://www.barc.gov.in

Next Story

Most Viewed