రూ. లక్షకు పైగా జీతంతో ONGC లో ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
రూ. లక్షకు పైగా జీతంతో ONGC లో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లిమిటెడ్.. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గేట్‌- 2023 ద్వారా ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్

ఏఈఈ (సిమెంటింగ్)- పెట్రోలియం

ఏఈఈ (సివిల్)

ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్

ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం

ఏఈఈ (ఎలక్ట్రికల్)

ఏఈఈ (ఎలక్ట్రానిక్స్)

ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్)

ఏఈఈ (మెకానికల్)

ఏఈఈ(ప్రొడక్షన్‌)- మెకానికల్

ఏఈఈ(ప్రొడక్షన్‌)- రసాయన

ఏఈఈ(ప్రొడక్షన్‌)- పెట్రోలియం

ఏఈఈ(ఎన్విరాన్‌మెంట్‌)

ఏఈఈ(రిజర్వాయర్)

కెమిస్ట్‌

జియాలజిస్ట్‌

జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్‌)

జియో ఫిజిసిస్ట్ (వెల్స్)

మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్

ప్రోగ్రామింగ్ ఆఫీసర్

ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌

ఏఈఈ (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్)

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు ఉండాలి.

వయసు: అభ్యర్థులు 31.07.2023 నాటికి 30 ఏళ్లు మించరాదు.

ఏఈఈ(డ్రిల్లింగ్/ సిమెంటింగ్) పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: గేట్- 2023 స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం: నెలకు రూ.60,000 – 1,80,000 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 5, 2023

వెబ్‌సైట్‌: https://ongcindia.com



Next Story

Most Viewed