ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లో IT ఆఫీసర్స్ ఉద్యోగాలు

by Disha Web Desk 9 |
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లో IT ఆఫీసర్స్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులు కాంట్రాక్ట్ పీరియడ్ మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. అలాగే వాని పని తీరును బట్టి మరో 3 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది. కాగా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియకు ఈరోజు, జూలై 3 వరకు అవకాశం ఉంది. కాగా ఉద్యోగం పొందాలనే అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ippbonline.comని సందర్శించి, ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జూన్ 13న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంస్థలో 43 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు రాత్రి 11:59 PMకి రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. IPPBL ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది.

IPPBL IT ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీల వివరాలు

ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్ - ఐటీ): 30 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్ - ఐటీ): 10 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ): 3 పోస్టులు

IT ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ అర్హతలు

IT ఆఫీసర్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు 24 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ),ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ) కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 30 నుంచి 40 సంవత్సరాలు, 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

IPPBL IT ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023: ఎంపిక ప్రక్రియ..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ IT ఆఫీసర్ ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అయితే, సముచితమైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి బ్యాంక్ ఇంటర్వ్యూతో పాటు అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించవచ్చు.

అన్ని పోస్టులకు అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

SC/ST/PwD కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు రూ. 150 ఇంటిమేషన్ ఫీజు చెల్లించాలి.

IPPBL IT ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు విధానం

అధికారిక వెబ్‌సైట్ ippbonline.comని సందర్శించి అప్లికేషన్ ఫిల్ చేయాలి.

హోమ్‌పేజీలో, మీకు 'కెరీర్స్' కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

'43 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్' కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

తదుపరి దశలో, రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసి సైన్ అప్ చేయండి.

అనంతరం పూర్తి అప్లికేషన్ ను చెక్ చేసుకుని పేమెంట్ చేయడం ద్వారా దరఖాస్తు పూర్తవుతుంది.

Next Story

Most Viewed