ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఉచిత భోజన, వసతితోపాటు శిక్షణ

by Disha Web Desk 17 |
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఉచిత భోజన, వసతితోపాటు శిక్షణ
X

దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి ఏడాది (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్; ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉంటాయి.

అడ్మిషన్లు: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు - 2023

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 25, 2023.

వెబ్‌సైట్: https://www.tsmodelschools.com

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో ITI - 2023 కోర్సు అడ్మిషన్లు



Next Story

Most Viewed