కేంద్ర బలగాల్లో జాయిన్ అవుతారా.. CAPF లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

by Disha Web Desk 17 |
కేంద్ర బలగాల్లో జాయిన్ అవుతారా.. CAPF లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్ - 2023కు ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోంది. ఈ మొత్తం పోస్టులను కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీలలో భర్తీ చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా అసిస్టెంట్ కమాండెంట్‌ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 16 వరకు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

యూపీఎస్సీ సీఏపీఎఫ్ నోటిఫికేషన్ వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 322.

పోస్టుల వివరాలు :

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్ - 2023

బీఎస్ఎఫ్ - 86

సీఆర్‌పీఎఫ్ -55

సీఐఎస్ఎఫ్ -91

ఐటీబీపీ - 60

ఎస్ఎస్‌బీ - 30

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరి తేదీ: మే 16, 2023.

ఎగ్జామ్ డేట్: జులై 6, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in/

అర్హత ప్రమాణాలు:

విద్యార్హతలు:

యూపీఎస్సీ సీఏపీఎఫ్ పరీక్షకు అర్హత సాధించడానికి అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం హాజరయ్యే అభ్యర్థులు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01/08/2023 నాటికి కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆగస్టు 2, 1998 కంటే ముందుగాను ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు. కొన్ని వర్గాలకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

వర్గం వయస్సు సడలింపు

షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ 5 సంవత్సరాలు

ఇతర వెనుకబడిన తరగతులు 3 సంవత్సరాలు

పౌర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 ఎక్స్-సర్వీస్‌మెన్ కూడా ఈ సడలింపుకు అర్హులు.

జనవరి 1, 1980 నుండి డిసెంబర్ 31, 1989 వరకు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో నివాసం 5 సంవత్సరాలు


అప్లికేషన్ ఫీజు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు రెండు రకాలుగా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులందరూ UPSC నిర్దేశించిన దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము రూ. 200 చెల్లించాలి. స్త్రీ/ SC/ ST అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వేతనం: CAPF నోటిఫికేషన్ పోస్టులను అనుసరించి వేతనం ఉంటుంది.

ర్యాంక్ Pay Scale (Basic Pay)

డైరెక్టర్ జనరల్ Rs. 2,25,000

అదనపు డైరెక్టర్ జనరల్ Rs. 1,82,200 – Rs. 2,24,100

ఇన్స్పెక్టర్ జనరల్ Rs. 1,44,000 – Rs. 2,18,000

డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ Rs. 1,31,000 – Rs. 2,16,600

సీనియర్ కమాండెంట్ Rs. 1,23,000 – Rs.2,15,900

కమాండెంట్ Rs. 78,800 – Rs. 2,09,200

డిప్యూటీ కమాండెంట్ Rs. 67,700 – Rs. 2,08,700

అసిస్టెంట్ కమాండెంట్ Rs. 56,100 – Rs. 1,77,500...

దరఖాస్తు ఇలా చేయండి:

అభ్యర్థులు UPSC వెబ్‌సైట్ upsc.gov.inకి లాగిన్ అవ్వాలి.

‘UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ 2023’ లింక్ కోసం సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.

అవసరమైన విభాగాలలో వివరాలను సరిగ్గా పూరించండి.

దరఖాస్తు రుసుము వర్తించినట్లయితే చెల్లించండి

‘సబ్మి‌ట్’ బటన్ పై క్లిక్ చేయండి.

మీ CAPF (అసిస్టెంట్ కమాండెంట్) దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సూచనల కోసం ప్రింట్ తీసుకోవాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed