వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌లోనే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్!

by  |
వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌లోనే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్!
X

దిశ, వెబ్‌డెస్క్: జియో కస్టమర్లు త్వరలో తమ సబ్‌స్క్రిప్షన్ రీఛార్జ్‌ను వాట్సాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్టు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, మెటా(గతంలో ఫేస్‌బుక్) వెల్లడించాయి. బుధవారం జరిగిన ఇరు సంస్థలకు చెందిన ఓ కార్యక్రమంలో జియో, మెటా భాగస్వామ్యం ద్వారా దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫామ్ డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. అలాగే, ఇరు సంస్థల పరస్పర సహకారంతో మరిన్ని కొత్త ఆలోచనలకు వీలవుతుందని తెలిపారు.

దీనివల్ల మొత్తం తమ వినియోగదారులకు ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను సులభతరం చేస్తుందని, వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఫీచర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో పెద్దలకు, బయటకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఇషా అంబానీ వివరించారు. వాట్సాప్ ద్వారా రీఛార్జ్‌తో చెల్లింపుల సామర్థ్యం మరింత పటిష్టమవుతుందని, లక్షల మంది జియో సబ్‌స్క్రైబర్ల జీవితాలను ఇంకాస్త సౌకర్యవంతంగా మారుస్తుందని ఆమె తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక చివరి నాటికి రిలయన్స్ జియో సుమారు 43 కోట్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. జియోమార్ట్‌లో 5 లక్షల మందికి పైగా రిటైలర్లు ఉన్నారని, వారి సంఖ్య పెరుగుతోందని ఇషా అంబానీ తెలిపారు. వాట్సాప్ కమ్యూనికేషన్, చెల్లింపుల ద్వారా జియోమార్ట్‌తో కలిసి మెరుగైన్న షాపింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

JIO యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఒక్క రూపాయికే నెలంతా ఇంటర్నెట్



Next Story