జెస్సికా లాల్ హంతకుడి విడుదల

by  |
జెస్సికా లాల్ హంతకుడి విడుదల
X

న్యూఢిల్లీ: మాడల్ జెస్సికా లాల్ హంతకుడు మను శర్మ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతనితోపాటు మరో 18 మంది ఖైదీలు సోమవారం ఈ జైలు నుంచి బయటకొచ్చారు. జైళ్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్న నిర్ణయంలో భాగంగా విడుదల చేసే ఖైదీలపై ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే వీరు విడుదలయ్యారు. 1999 ఏప్రిల్ 30న ఓ రెస్టారెంట్‌లో డ్రింక్ సర్వ్ చేయలేదని మాడల్ జెస్సికా లాల్‌ను మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు మను శర్మ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసులో తొలుత ట్రయల్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువడిన నేపథ్యంలో హైకోర్టు యావజ్జీవ జైలు శిక్షను విధించింది. సుమారు 17 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన మను శర్మ తాజాగా, సోమవారం పెరోల్‌పై విడుదలయ్యాడు. మను శర్మ పశ్చాత్తాపపడ్డాడని, ఇప్పుడు అతను మంచి మనిషిగా మారాడని తాను నమ్ముతున్నట్టు జెస్సికా లాల్ సోదరి సబ్రీనా లాల్ గతంలో పేర్కొంది. అతన్ని విడుదల చేసినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఈ క్రైమ్ ఆధారంగా బాలీవుడ్‌లో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed