JEE‌ మెయిన్స్‌‌లో తెలంగాణ విద్యార్థుల హవా.. 13మందికి 100 పర్సంటైల్..!

by  |
JEE‌ మెయిన్స్‌‌లో తెలంగాణ విద్యార్థుల హవా.. 13మందికి 100 పర్సంటైల్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : జేఈఈ మెయిన్స్ (మార్చి నెల) ప్రవేశ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన JEE-మెయిన్స్ పరీక్షకు 5 లక్షల 90వేల మంది విద్యార్థులు హాజరుకాగా, కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే 100శాతం స్కోర్ సాధించారు. అందులో తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులు ఉండటం విశేషం. వంద శాతం స్కోర్ చేసిన వారి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించగా.. అందులో మొదటి స్థానంలో తెలంగాణ విద్యార్థి బన్నూరు రోహిత్ రెడ్డి నిలిచారు. రెండో స్థానంలో బ్రతిన్ మోండల్-వెస్ట్ బెంగాల్, మూడో స్థానంలో సిద్ధార్థ కార్ల-ఢిల్లీ, నాలుగో స్థానంలో కుమార్ సత్యదర్శి-బిహార్, ఆ తర్వాతి స్థానాల్లో మృదిల్ అగర్వాల్- రాజస్తాన్, అశ్విన్ అబ్రహం- తమిళ్‌నాడు, అతర్వా అబిజిత్ తంబాత్- మహారాష్ట్ర, బక్షి గార్గి మకరంద్- మహారాష్ట్ర, మధుర్ ఆదర్శ్ రెడ్డి- తెలంగాణ, జెనిత్ మల్హోత్ర- రాజస్తాన్, జాస్యుల వెంకట్ ఆదిత్య- తెలంగాణ, రోహిత్- రాజస్థాన్, కావ్య చోప్రా- ఢిల్లీ ఉన్నారు.

జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే సెషన్స్ ముగిసిన తర్వాతే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాలుగు సెషన్స్‌ కలిపి అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారితో తుది జాబితా వెలువడుతుందని NTA తెలిపింది. అంతకుముందు 2020 డిసెంబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈసారి జేఈఈ పరీక్షలు నాలుగు సెషన్లలో జరుగుతాయని ప్రకటించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం, జేఈఈ(మెయిన్)-2021 నాలుగు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఫిబ్రవరిలో, రెండవది మార్చి, మూడవది ఏప్రిల్‌, నాల్గవ మరియు చివరి సెషన్ మేలో ఉంటుందని మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.



Next Story

Most Viewed