డొమెస్టిక్ వాటర్ వినియోగానికి ‘ఆధార్ బయోమెట్రిక్’

by  |
డొమెస్టిక్ వాటర్ వినియోగానికి ‘ఆధార్ బయోమెట్రిక్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : డొమెస్టిక్ వినియోగ‌దారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డానికి సెక్షన్‌కు ఒక ఆధార్ బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేస్తున్నామని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్​ తెలిపారు. నెల‌కు 20 వేల ఉచిత తాగునీటి ప‌థ‌కం అమ‌లు పురోగ‌తిపై మంగ‌ళ‌వారం అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. దానకిషోర్​ మాట్లాడుతూ.. ఈ ప‌థ‌కానికి సంబంధించిన ప్రక్రియ‌ను మ‌రింత‌ వేగ‌వంతం చేయడానికి చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

డొమెస్టిక్ స్లమ్ వినియోగదారుల కోసం ఇప్పటికే జ‌ల‌మండ‌లి శిక్షణ ఇచ్చిన మీట‌ర్ రీడ‌ర్లు వినియోగ‌దారుల‌ ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఫంక్షనల్ మీటర్లు లేని వారు, మీట‌ర్లు ప‌ని చేయ‌ని వారు తమ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకున్న తేదీ నుంచి ఈ పథకాన్ని పొందేందుకు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స‌త్యనారాయ‌ణ‌, రెవెన్యూ డైరెక్టర్ విఎల్ ప్రవీణ్‌కుమార్, ఎం.స్వామి పాల్గొన్నారు.


Next Story