సమ్మెకు సిద్ధంకండీ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపు

by  |
సమ్మెకు సిద్ధంకండీ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపు
X

దిశ, తాండూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోలేటిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, హెచ్‌ఎం‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజాబాబు, సీఐటీయూ ఏరియా కార్యదర్శి అంబాల ఓదెలు, ఇఫ్టూ ఏరియా అధ్యక్షుడు తిరుపతి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణిరాంసింగ్ మాట్లాడుతూ.. ఎన్టీపీసీతో సహా సింగరేణిలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, జీవో నంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసుల్లో 18 డిమాండ్లు ఉన్నాయని, వాటిని వెంటనే అమలు చేయాలన్నారు. డిసెంబర్ 26న గోదావరిఖనిలో జరిగే పోరుగర్జన సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు.

Next Story

Most Viewed