- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పగలు ఎండ.. రాత్రి చలి
దిశ ప్రతినిధి, మెదక్: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు చలితో గజగజ వణికిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉక్కపోత షురూ అయ్యింది. గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. రాత్రి మాత్రం చలి యథాతథంగా ఉంటున్నది. వాతావరణంలో సంభవించే మార్పులతో వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
దంచి కొడుతున్న ఎండలు
సాధారణంగా జనవరి నెలాఖరులో చలి తీవ్రంగానే ఉంటుంది. శివరాత్రి వండుగలో శివశివ అనుకుంటూ చలి పోతుందనే నానుడి ఉంది. కానీ ఈ యేడు వేసవి ప్రారంభం కాకముందే ఉమ్మడి మెదక్ జిల్లాలో వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలు నమోదవుతుంది. ఈ ఉదయం వేళ కొద్దిగా చలి అనిపించిన ఉదయం 9 దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే మే మాసం నాటికి 50 డిగ్రీలకు చేరోచ్చని అంచనా వేస్తున్నారు.
చలి కంటిన్యూ
పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రాత్రి వేళలో చలి మాత్రం అలాగే కొనసాగుతున్నది. సాయంత్రం 6.30 గంటల సమయంలో చీకటి పడుతుండగా.. రాత్రి 8-9 గంటల నుంచి ఉదయం7 గంటల వరకు చలి ప్రభావం కనిపిస్తున్నది. గత వారం రోజులుగా రాత్రి వేళ 15-19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వాతావరణ మార్పులతో ఆందోళన..
వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, చిన్న పిల్లల ఆస్పత్రులు, జనరల్ ఫిజిషియన్ ఆస్పత్రుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. దోమలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున దోమతెరలు లాంటివి వాడాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇప్పటికే కరోనాతో భయపడుతున్న జనం ఏ చిన్న జలుబు వచ్చినా భయపడుతున్నారు. వెంటనే ఆస్పత్రులకు వెళ్లి మొదట కరోనా పరీక్ష చేయించుకున్న తర్వాతే మిగతా రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి
ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, తదితర సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనలు, సలహాల మేరకు ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది. మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. రోజు అన్నం మాత్రమే కాకుండా చపాతీ, జొన్న రొట్టె లాంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా దోమల బెడద లేకుండా చూసుకోవాలి.
-రామచందర్‌రావు, జనరల్ ఫిజిషియన్