దేశంలో చక్కెర తగ్గింది!

by  |
దేశంలో చక్కెర తగ్గింది!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల విదేశీ మార్కెట్లలో ఇండియాకు చెందిన చక్కెర అమ్మకాలు దెబ్బతిన్నాయని ఇండియా సుగల్ మిల్స్ అసోసియేషన్(ఇస్మా) తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 15 వరకూ దేశంలో చక్కెర ఉత్పత్తి 2.47 కోట్ల టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఏడాదిలో ఇది 3.11 కోట్ల టన్నులతో పోలిస్తే ఈసారి 20 శాతం తగ్గింది.

ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఎగుమతులు ప్రభావితమయ్యాయి. ఇటీవల రూపాయి విలువ క్షీణించడం వల్ల ఎగుమతులకు కొంత ఉపశమనం కలిగిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తెలిపింది. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా స్థాయిలో తక్కువ కస్టమ్స్ సుంకాన్ని ఇవ్వడం ద్వారా ఇండోనేషియాలో భారతీయ చక్కెరకు అధిక డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని వారాలుగా ఇండోనేషియాకు చక్కెర ఎగుమతి అవుతోంది. కానీ, జూన్-జులై నుంచి మరింత డిమాండ్ ఏర్పడే అవకాశముంది. ఈ డిమాండ్ మరో ఏడాదిపాటు కొనసాగవచ్చని ఇస్మా పేర్కొంది.

ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం..ఇండోనేషియాకు అవసరమైన చక్కెరలో 80-85 శాతం థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత సంవత్సరంలో థాయ్‌లాండ్‌లో 65 లక్షల టన్నుల తక్కువ చక్కెర ఉత్పత్తి జరగడం, రానున్న ఏడాది మరింత తగ్గుతుందనే సంకేతాలతో ఇండోనేషియా మన చక్కెరను అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత సంవత్సరానికి ఎగుమతి చేయని కోటా నుంచి ప్రభుత్వం తిరిగి కేటాయించిన తర్వాత ఇండియా ఎగుమతిదారులకు ఎక్కువ చక్కెర ఎగుమతి చేసే అవకాశముంటుందని చక్కెర పరిశ్రమల సంస్థ పేర్కొంది. మిగులు చక్కెరలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

రెస్టారెంట్లు, మాల్స్, సినిమా థియేటర్లు మూసివేయడం వల్ల ఐస్ క్రీమ్, కూల్‌డ్రింక్స్, మిఠాయిలు, స్వీట్లు మొదలైన చక్కెర ఉత్పత్తుల డిమాండ్‌పై ప్రభావితం స్పష్టంగా ఉంది. దేశంలో చక్కెర ఉత్పత్తి అధికంగా చేసే మొదటి మూడు రాష్ట్రాలు ఏప్రిల్ 15 వరకూ మహారాష్ట్ర 5.1 కోట్ల టన్నులు, ఉత్తర ప్రదేశ్ 1.08 కోట్ల టన్నులు, కర్ణాటక 30 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తిని అందించాయి.

Tags : coronavirus, COVID-19, lockdown, ISMA, sugar export


Next Story

Most Viewed