ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చా ?

by  |
ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చా ?
X

కరోనా భయంతో .. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాణిజ్య, వర్తక సంస్థలన్నీ కూడా బంద్ అయ్యాయి. ప్రజలకు నిత్యం అవసరమయ్యే సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ టైం లో .. చాలా మంది ఆన్లైన్ లో షాపింగ్ చెయ్యొచ్చు కదా అనుకుంటున్నారు.. కానీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ఆ ప్రభావం ఆన్‌లైన్ షాపింగ్‌పైనా పడింది. ఫ్లిప్‌కార్ట్ , మింత్ర, ఇ-కామర్స్ దిగ్గజ కంపెనీలు ఆన్‌లైన్ షాపింగ్‌ను నిలిపివేశాయి. అంతే కాదు ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ, జోమాటో లు కూడా సర్వీస్ చేస్తున్నప్పటికీ.. చాలా మితంగానే వాటి సేవలున్నాయి.
ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. వేలి కొనలపైనే.. ప్రపంచం నాట్యమాడుతోంది. నచ్చిన సినిమాలకు వెళ్లాలన్నా.. ఇష్టమైన ఫుడ్ తినాలన్న.. బట్టలు కొనాలన్న.. కరెంట్ బిల్లు కట్టలన్నా.. ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే.. ప్రజలంతా డిజిటల్ శకానికి, ఆన్ లైన్ షాపింగ్ కు అలవాటు పడ్డారు. సో.. దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉంది. సినిమాలు చేస్తున్న, నచ్చిన ఫుడ్ చేసుకొని తింటున్న..ఇంట్లో చాలా మంది బోర్ ఫీల్ అవుతుంటారు. దాంతో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటారు. కానీ అది కుదరని పని. ఒక వేళ లాక్ డౌన్ కె ముందే .. ఫ్లిప్‌కార్ట్‌లో ఏమైనా ఆర్డర్ చేసినా? అమెజాన్‌లో ఏదైనా బుక్ చేసినా? అవి ఇప్పట్లో రావడం కష్టమే. ఎందుకంటే..ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ లాంటి ఇ-కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ నిలిపివేషాయి. లాక్ డౌన్ కు ముందు .. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ చాలావరకు డిస్పాచ్ అయి ఉంటాయి. అవి మనకు సమీపంలో ఉన్న డెలివరీ హబ్స్‌కి వచ్చేసి ఉంటాయి.దేశవ్యాప్త లాక్‌డౌన్ అంటే అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్నీ కార్యకలాపాలు బంద్ అయినట్టే. అది ఇ-కామర్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది.

వాళ్ళది అదే పరిస్థితి :

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. చాలా మంది ఇళ్ల కు వెళ్లలేక, హాస్టల్ లో ఉండే వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరికి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇ-కామర్స్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, డెలివరీ బాయ్స్‌ది ఇదే పరిస్థితి. డెలివరీ విషయంలో .. ఇ-కామర్స్ కంపెనీలు ఇంకా స్పష్టత కు రాలేవు.

నో న్యూ ఆర్డర్స్:

కరోన కారణంగా ఎక్కడి సేవలు అక్కడే నిలిచిపోయాయి. అందువల్ల ఇ-కామర్స్ కంపెనీలు కొత్త ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, లాంటి సంస్థలున్నాయి. అయితే అమెజాన్ మాత్రం నిత్యావసర వస్తువుల్ని మాత్రమే లిస్టింగ్‌లో ఉంచాయి. వాటి ఆర్డర్లు మాత్రమే తీసుకుంటున్నాయి. ఒకవేళ కంపెనీలు ఆర్డర్లు తీసుకున్నా అవి కస్టమర్లకు చేర్చేందుకు డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ కావాలి. మరి లాక్‌డౌన్ కొనసాగుతుండగా వారిని బయట తిరగడానికి అనుమతి ఇస్తారా అన్నది అనుమానమే.
కరోనా కారణంగా అందరిలోనూ భయాలు మొదలయ్యాయి. దాంతో అందరూ కూడా .. విపరీతంగా కొనుగోళ్లు చేశారు. అదే విధంగా ఆన్లైన్ లో .. ఎక్కువగా ఆర్డర్లు చేశారు. లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు నుంచి కొన్ని గంటల వరకు ఈ ఆర్డర్ల సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటు డెలివరీ పార్ట్‌నర్స్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్నీ వేర్‌హోజ్‌లు, డెలివరీ సెంటర్లలో ఉండిపోయాయి. కాబట్టి వాటి కోసం కస్టమర్లు ఎదురుచూడటం తప్ప వేరే మార్గం లేదు.లాక్ డౌన్ ముగిస్తే కానీ.. అవి ఇంటికి చేరే దారి లేదు. మరి ఏప్రిల్ 14 వరకే.. ఈ లాక్ డౌన్ ఉంటుందా? ఇంకా కొనసాగుతుందా? అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది .

Tags: corona virus, shopping , online , orders, flipkart, amazon, myntra, lock down

Next Story

Most Viewed