ఐపీఎల్ 2024: సొంత గడ్డపై తెలుగోడికి చాన్స్ దక్కేనా..?

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: సొంత గడ్డపై తెలుగోడికి చాన్స్ దక్కేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా 8వ మ్యాచ్ నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై జట్ల మధ్య జరగునుంది. కాగా ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు హోం గ్రౌండ్ కావడంతో.. పెద్ద ఎత్తున ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు బారులు తీరారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా కంటీన్యూగా 10 మ్యాచులు ఆడింది. లేదు. గత సీజన్లో ఒకే ఒక్క ప్లేయర్ ను సన్ రైజర్స్ జట్టు వేలంలో కొని.. కేవలం రెండు మ్యాచులు మాత్రమే అనిపించింది.

ఇటీవల జరిగిన అన్ని ప్రాక్టీస్ మ్యాచుల్లో నితీష్ కుమార్ రెడ్డి అనే తెలుగు ప్లేయర్ సత్తా చాటుతున్నాడు. నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అతను వరుసగా ఆరు సిక్సర్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సొంతగడ్డపై అయిన జట్టులో ఉన్న ఎకైక తెలుగు ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. 20 ఏళ్ల నితీష్.. రైట్ హ్యాండ్ బ్యాటర్. అలాగే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. అలాగే మిడిల్ అర్డర్ బ్యాటింగ్ లో కూడా అతను నిలకడగా రాణించగలడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచులో అతనికి చోటు దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.


Next Story

Most Viewed