జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన కోహ్లీ

by Dishafeatures2 |
జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన కోహ్లీ
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్లెక్సిబిలిటీ కోసం క్రీడాకారులు జెర్సీలు ధరిస్తూ ఉంటారు. ఆ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లతో పాటు నెంబర్లు ఉంటాయి. ఒక్కో ఆటగాడికి ఒక్కో నెంబర్ జెర్సీ మీద ఉంటుంది. అయితే ఆ జెర్సీ నెంబర్ల వెనుక ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ను రివీల్ చేశాడు. నెంబర్ 18తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పాడు. 2008లో అండర్ 19 వరల్డ్ కప్ కోసం మొదటిసారిగా కోహ్లీ ఇండియా తరఫున ఆడాడు. ఆ సమయంలో టీమ్ తరఫున ఆయనకు 18 నెంబర్ జెర్సీని కేటాయించారు. ఇక ఈ టోర్నీలో సత్తా చాటిన ఇండియా కప్ ను కొల్లగొట్టింది. ‘‘నాకు 18 నెంబర్ జెర్సీ కావాలని ఏనాడు మేనేజ్ మెంట్ ను అడగలేదు. వాళ్లే ఇచ్చారు’’ అని కోహ్లీ చెప్పాడు.

అయితే తర్వాతి క్రమంలో 18 నెంబర్ తో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2008 ఆగస్టు 18న తాను మొదటిసారి ఇండియా తరఫున ఆడానని, అలాగే 2006 డిసెంబర్ 18న తమ నాన్న చనిపోయారని కోహ్లీ చెప్పాడు. ఈ రెండు ఘటనలు 18వ తేదీన జరిగాయని, అందువల్ల 18వ నెంబర్ ను ప్రత్యేకంగా భావిస్తానని కోహ్లీ చెప్పాడు. కాగా ఐపీఎల్ లో ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఐపీఎల్ లో 7,062 రన్స్ చేశాడు. ఇక ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 25 వేలకు పైగా రన్స్ చేశాడు. కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 10వ నెంబర్ జెర్సీ ధరించగా.. ధనాధన్ ధోని 07వ నెంబర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45వ నెంబర్ జెర్సీ ధరించి దుమ్ములేపుతున్నారు.

Next Story

Most Viewed