రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. MS ధోనీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. MS ధోనీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని.. ఇదే అతని చివరి సీజన్ అని వార్తలు వచ్చాయి. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. దీనికి తోడు చెన్నై ఫైనల్ చేరుకోవడం.. ధోనీ ఆడిన ప్రతీ గ్రౌండ్‌నుంచి ప్రత్యేక వందనం అందుకొవడంతో.. ధోని రిటైర్మెంట్ పక్కా అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో సోమవారం చెన్నై ఐపీఎల్ కప్పు కొట్టిన తర్వాత ధోని ఏం మాట్లాడారు అనే దానిపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ధోని మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో మాకు ప్రతీ చోటా.. ప్రత్యేక స్పందన లభించింది. వారందరికీ నా ధన్యవాదాలు.. నేను ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. కానీ ఇదే ఉత్సాహంతో మరో సీజన్ ఆడతాను.. దాని కోసం వచ్చే 9 నెలలు కష్టపడాల్సి ఉందని ధోని తెలిపారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ లేదని స్పష్టం కావడంతో నరేంద్ర మోడీ గ్రౌండ్ మొత్తం ఆనందంతో ఊగిపోయింది.

Also Read: నాడు కోహ్లీని రోహిత్.. నేడు జడేజాను ధోనీ

Next Story

Most Viewed