IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

by Vinod kumar |
IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ ఇప్పుడే విజయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ త్రిపాఠీ కూడా బాగానే ఆడుతున్నాడు. వీరికితోడు కొత్త రోల్‌లో అభిషేక్ శర్మ కూడా చెలరేగుతున్నాడు.

కేవలం మయాంక్ అగర్వాల్ మాత్రమే విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా అగర్వాల్ పెద్దగా రాణించలేదు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, మార్కో యాన్సెన్, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మయాంక్ మార్కండే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సన్‌రైజర్స్ బెస్ట్ వికెట్ టేకర్ అతనే. ఈ క్రమంలో ముంబైతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తమ జట్టులో పెద్దగా మార్పులు చేసేలా కనిపించడం లేదు.

అదే సమయంలో ముంబై కూడా ఇప్పుడే విజయాల బాట పట్టింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ కూడా ఫామ్ అందుకున్నారు. దీంతో ముంబై బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. అయితే బౌలింగ్‌లో ఎవరూ ఊహించని విధంగా తమ చివరి మ్యాచులో జేసన్ బెహ్రెండాఫ్‌ను ముంబై పక్కన పెట్టింది. గాయంతో జోఫ్రా ఆర్చర్ తప్పుకోవడంతో బెహ్రెండాఫ్ ఆ జట్టు ప్రధాన పేసర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, అతన్ని పక్కన పెట్టిన ముంబై.. డువాన్ యాన్సెన్‌ను ఆడించింది. కేవలం ఒక్క మ్యాచ్ తర్వాత అతన్ని పక్కన పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈ సారి అన్నదమ్ములైన మార్కో యాన్సెన్, డువాన్ యాన్సెన్ ఒకరితో ఒకరు పోటీ పడటం చూడొచ్చు. అర్జున్ టెండూల్కర్‌కు కూడా మరిన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముంబైలో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఇరుజట్ల గత రికార్డులు పరిశీలిస్తే.. 19 మ్యాచ్‌లు జరగ్గా.. పదింటిలో ముంబై నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది.

హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (WK), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్.

ముంబై (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రెండోర్ఫ్.

Next Story

Most Viewed