IPL 2023: చెలరేగిన RR బ్యాటర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు భారీ టార్గెట్..

by Vinod kumar |
IPL 2023: చెలరేగిన RR బ్యాటర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు భారీ టార్గెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో పోరులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్‌కు పవర్ ప్లేలో ఏ మాత్రం కలిసి రాలేదు. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ బంతిని ఇష్టం వచ్చినట్టు బాదడంతో RR 20 ఓవర్లకు 203 పరుగుల భారీ స్కోరు చేసింది.. 6 ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 85 పరుగులకు చేరిందంటే బట్లర్, జైస్వాల్ దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయగా.. జైస్వాల్ 37 బంతుల్లోనే 9 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.

అయితే బట్లర్‌ను లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ బౌల్డ్ చేయడంతో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (54; 22 బంతుల్లో 7x4, 3x6), యశస్వీ జైశ్వాల్‌ (54; 37 బంతుల్లో 9x4), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (55; 32 బంతుల్లో 3x4, 4x6) వరుసగా హాఫ్ సెంచరీలు బాదేశారు. RR 20 ఓవర్లకు 203 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్‌లో ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి నటరాజన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Next Story