IPL 2023: వారిద్దరి బౌలింగ్‌లో ఇబ్బందులు పడ్డా : Rohith sharma

by Disha Web Desk 13 |
IPL 2023: వారిద్దరి బౌలింగ్‌లో ఇబ్బందులు పడ్డా : Rohith sharma
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ప్లే ఆఫ్‌లో చెన్నై వేదికగా మరికొన్ని గంటల్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది. గెలిచి జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్ ఆడే జట్టు ఏదనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. "ముంబై ఇండియన్స్ సూపర్ స్టార్ టీమ్‌గా పిలుస్తారని.. ఆ స్థాయిలో జట్టును తీసుకుని రావడానికి ఫ్రాంచైజీ ఎంతో కష్టపడిందని పేర్కొన్నాడు. ప్లేయర్లను సూపర్ స్టార్లుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని వివరించాడు. తన కెరీర్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి అత్యుత్తమ స్థానం ఉందని, ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని" పేర్కొన్నాడు.

తననను ఒక పరిణితి చెందిన క్రికెటర్‌గా మార్చిందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి సీనియర్లతో పాటు తిలక్ వర్మ, నేహాల్ వధెరా యంగ్ క్రికెటర్లకు ఎంతో అవకాశం కల్పించిందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను అత్యంత కఠినమైన బౌలర్‌గా డేల్ స్టెయిన్‌‌ అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడేవాడినని.. తాను అభిమానించే బౌలర్ కూడా స్టెయినేనని, ఎప్పుడు ఎలాంటి బంతులను సంధిస్తాడనే విషయాన్ని బ్యాటర్ ఏ మాత్రం అంచనా వేయలేడని అన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌కు చెందిన సునీల్ నరైన్‌ను అత్యంత కఠినమైన బౌలర్‌గా రోహిత్ శర్మ తెలిపాడు.

Next Story

Most Viewed