IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఈ సీజన్లో ఎదురులేని టీమ్‌గా కొనసాగుతోంది. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. ఇక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌కు తిరుగులేదు. ఎలాంటి బౌలరైనా పరుగుల వరద పాస్తున్నాడు.

మిడిలార్డర్‌లో హెట్‌మైయిర్‌ మ్యాచులను ఫినిష్‌ చేస్తున్న తీరు సూపర్. అశ్విన్‌, ధ్రువ్‌ జోరెల్‌ బ్యాటుతో ఇంపాక్ట్‌ చూపిస్తున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్‌బౌల్ట్‌ పవర్‌ ప్లేలోనే కనీసం 2 వికెట్లు అందిస్తున్నాడు. సందీప్ శర్మ కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెన్త్‌లో బంతులు వేస్తున్నాడు. యూజీ, యాష్‌, జంపా స్పిన్‌ బాగుంది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటున్నాడు.

ఇక లక్నో సూపర్‌ జెయింట్స్ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. అయితే కొన్ని మ్యా్చ్‌లో వెనకబడి గెలిచే మ్యాచులను చేజార్చుకుంటోంది. గతేడాది రెండు మ్యాచుల్లోనూ లక్నోపై రాయల్స్‌దే విక్టరీ.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్‌ సేన పట్టుదలగా ఉంది. కైల్‌ మేయర్స్‌ అటాకింగ్‌తో ఆడుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ తన అప్రోచ్‌ మార్చుకున్ని మెరుపు ఓపెనింగ్స్‌ ఇవ్వాలి.

ఇక మిగిలిన బ్యాటర్స్‌లో దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య ఇంకా స్ట్రగుల్‌ అవుతున్నారు. నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, యుష్‌ బదోనీ పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌ పేస్‌ బాగుంది. అవేశ్‌ మరింత తెలివిగా బౌలింగ్‌ చేయాలి. కుర్రాడు యుధ్‌వీర్‌ సింగ్‌ పేస్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్‌, కృనాల్‌, కృష్ణప్ప, అమిత్‌ మిశ్రా స్పిన్‌ బాగుంది. అన్ని రకాలుగా కట్టడి చేస్తున్న లక్నో.. ప్రత్యర్థికి ఏదో ఒక చోట మూమెంటమ్‌కు అవకాశం ఇస్తోంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ప్లేయింగ్ XI):

కెఎల్ రాహుల్ (సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (WK), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్, నవీన్-ఉల్-హక్ (మార్క్ వుడ్ కోసం) , రవి బిష్ణోయ్.

రాజస్తాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(C/WK), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్ (ఆడమ్ జంపా కొరకు), ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.



Next Story

Most Viewed