చెన్నై అభిమానులకు భారీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌కు ధోని పై నిషేధం..?

by Disha Web Desk 12 |
చెన్నై అభిమానులకు భారీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌కు ధోని పై నిషేధం..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ GT-CSK మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఘన విజయం సాధించి IPL ఫైనల్ చేరుకుంది. కానీ ఇంతలోనే చెన్నై, ధోని అభిమానులకు ఐపీఎల్ రూల్స్ భారీ షాక్ ఇవ్వనున్నాయి. క్వాలిఫైయర్ 1 లో స్లో ఓవర్ రేట్ కారణంగా నిబంధనల ప్రకారం ధోనిపై నిషేధం విధించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం వరుస మ్యాచుల్లో స్లో ఓవర్ రేట్ కొనసాగితే.. మొదటి రెండు మ్యాచుల్లో ఫైన్ విధిస్తారు. అయినా కూడా అలాగే కొనసాగితే ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విదిస్తారు. దీంతో అంతకు ముందు స్లో ఓవర్ కారణంగా ఫైను ఎదురుకున్న ధోని.. మరీ క్వాలిఫైయర్ మ్యాచ్ లో మళ్లీ అదే తప్పిదం చేశారు. అలాగే మొదటి క్వాలీఫయర్ మ్యాచ్‌లో కూడా ధోని ఎంపైర్ తో వాగ్వాదానికి దిగి మ్యాచును దాదాపు నాలుగు నిమిషాలు ఆపి మరి తన బౌలర్ కు బౌలింగ్ ఇచ్చాడు. మరీ ఈ రెండు తప్పిదాలు, స్లో ఓవర్ రేట్ కారణంగా ధోని.. నిషేదాన్ని ఎదుర్కుంటారా లేక.. మళ్లీ మ్యాచ్ ఫీజులో కోతనే ఎదుర్కుంటారో తెలియాలి అంటే.. ఐపీఎల్ అధికారులు తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

Read more:

ధోని చేతిలో పడితే ఎవరైన సూపర్ ప్లేయర్ కావాల్సిందే: Suresh Raina



Next Story

Most Viewed