ఆ కేసులో చిదంబరానికి ఊరట

by  |
ఆ కేసులో చిదంబరానికి ఊరట
X

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో వారికి వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపునిచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున వారిరువురూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో తమకు హాజరు నుంచి మినహాయించాలని వారిద్దరూ పెట్టుకున్న పిటిషన్‌కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 305 కోట్ల ముడుపులు తీసుకున్నారని తండ్రీ కొడుకులమీద మనీ లాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 మే 15న సీబీఐ చిదంబరంపై చార్జిషీటు దాఖలు చేసింది. 2019 ఆగస్టు 21న ఆయనను అరెస్టు చేసింది. అక్టోబర్ 16న ఈడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆరు రోజుల తర్వాత (అక్టోబర్ 22న) సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం కూడా 2018 ఫిబ్రవరిలో అరెస్టై మార్చిలో బెయిల్ పై విడుదలయ్యారు.


Next Story

Most Viewed