డిజిటల్​ సర్వే చేయడానికి ఏజెన్సీలకు ఆహ్వానం

by  |
Digital Land Survey
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 27 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్​ప్రాజెక్టు డిజిటల్​ల్యాండ్​సర్వే చేసేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. డిజిటల్​సర్వే, డిజిటల్​ల్యాండ్​పార్శిల్​మ్యాప్స్, ఆర్వోఆర్​రికార్డులను తయారు చేయాల్సి ఉంటుంది. శనివారం రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. 13వ తేదీ ఉదయం 11 గంటలకు ఇన్విటేషన్​ఫర్​ఎక్స్ప్రెషన్​ఆఫ్​ఇంటరెస్ట్(ఈఓఐ)లను ఓపెన్ చేయనున్నారు.

ప్రతి గ్రామానికి లొకేషన్స్, కంట్రోల్​పాయింట్స్, కో ఆర్డినేట్స్​ఇవ్వాలి. పీడీఎఫ్​రూపంలో జీఐఎస్​షేప్​లో విలేజ్​మ్యాప్, ఫీల్డ్​ల్యాండ్​రిజిస్టర్, గ్రామాల వారీగా స్పష్టమైన స్టేట్​మెంట్ వంటివి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ధరణి పోర్టల్​కింద సేవలందించే కంప్యూటర్ల నిర్వహణకు కూడా టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలి. బిడ్​అమౌంట్​ను రూ.20 వేలుగా నిర్ణయించారు.

Next Story

Most Viewed