ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు అమిత్ షా కౌంటర్

by  |
Home Minister Amit Shah
X

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ప్రచారాలు భారత ఐక్యమత్యాన్ని దెబ్బ తీయలేవని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా మంగళవారం ట్వీట్ చేశారు. కొన్ని గంటల తర్వత రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన వాతావరణ కార్యకర్త గ్రేటా థనబర్గ్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రైతుల ఆందోళనకు మద్దతుగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను పునరద్ధరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ, భద్రతాపరమైన చర్చలను పెంచడంపై ప్రశ్నిస్తూ ఇంకొంత మంది ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed