డైనోల వివరాలు తెలిపే ‘ఎన్సియంట్ ఎర్త్ గ్లోబ్’ మ్యాప్

by  |
డైనోల వివరాలు తెలిపే ‘ఎన్సియంట్ ఎర్త్ గ్లోబ్’ మ్యాప్
X

దిశ, వెబ్‌డెస్క్ : డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయినా, వాటి విశేషాలు తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అందులో భాగంగానే.. డైనోసార్లు ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రదేశంలోనే జీవించేవా? మనం తిరుగాడుతున్న ఈ నేలపైనే సంచరించాయా? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఎలా? ‘ఏన్సియంట్ ఎర్త్ గ్లోబ్’ అనే మ్యాప్ మనకు ఆ డైనోసార్ల గుట్టును బట్టబయలు చేస్తోంది. ఈ మ్యాప్ సాయంతో లక్షలాది సంవత్సరాల కిందట మనమున్న ప్రదేశంలో నిజంగానే డైనోలు నివసించి ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

పాలియోంటాలజిస్ట్‌, కంప్యూటర్ సైంటిస్ట్ ఇయాన్ వెబ్‌స్టర్.. ఈ ‘ఏన్సియంట్ ఎర్త్ గ్లోబ్’ మ్యాప్‌ను రూపొందించారు. ఈ మ్యాప్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించిన శిలాజాలు, డైనోసార్ల వివరాలను రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. మనం ఉంటున్న ప్రదేశంలో అందుబాటులో ఉన్న శిలాజాల రికార్డులను సెర్చ్ చేయడం మొదటి విధానమైతే, ఏదైనా స్పెసిఫిక్ స్పీసియస్ కోసం సెర్చ్ చేయడం మరో విధానం. ఈ మ్యాప్‌ను ఉపయోగించడం కూడా చాలా తేలిక.

డైనోల వివరాలు ఎలా తెలుసుకోవాలంటే.. ముందుగా మ్యాప్‌ను ఓపెన్ చేసి ఎడమ వైపున ఉన్న సెర్చ్ ఫీల్డ్‌లో మనం ఉంటున్న నగరాన్ని టైప్ చేయాలి. వెంటనే మ్యాప్‌లోని డేటాబేస్ ఆధారంగా.. మనముంటున్న నగరానికి సమీపంలో ఉన్న శిలాజాల లిస్ట్‌ చూపిస్తుంది. ఉదాహరణకు న్యూయార్క్ సిటీ అనే టైప్ చేశామనుకోండి.. పాలియోంటాలిజిస్ట్‌లు డిస్కవర్ చేసిన గ్రల్లాటర్, పెర్నోడన్, డ్రిప్టోసారస్ వంటి డైనోల వివరాలను చూపిస్తుంది. అంతేకాదు ప్రతి జాతికి సంబంధించిన వెబ్ పేజీ కూడా అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఆ డైనో జాతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇమేజెస్ ఉంటాయి. ఆ డైనో ఏయే ప్రదేశాల్లో జీవించి ఉండేదో వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మ్యాప్‌లో పింక్ రంగులో కనిపించే లొకేషన్లన్నీ కూడా.. పాలియోంటాలజిస్టులు ఏన్నో సంవత్సరాలుగా అధ్యయనం చేసి కనుగొన్న శిలాజాలను ఓ డేటా బేస్ ప్రకారం ఇందులో పొందుపర్చారు. మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఎక్కడ నివసించాయో కూడా తెలుసుకోవచ్చు.

Next Story