పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల..

by  |
పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల..
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యానవన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు రూ. 22.59 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. మే-సెప్టెంబర్ మధ్యకాలంలో వరదల వల్ల కలిగిన పంటనష్టానికి ఈ ఇన్ పుట్ సబ్సిడీని ఇస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం, ఉభయగోదావరి , కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో ఉద్యానవన పంటల రైతులకు ఈ ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేశారు. ఇక వ్యవసాయ పంటలకు రూ. 113.11 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది . జూన్- సెప్టెంబర్ మధ్య కాలంలో పంట నష్టానికి సంబంధించి ఈ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తోంది. గోదావరి , కృష్ణా, కుందూ నదులతో దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తోంది. 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన పంటలకు మాత్రమే ఇన్ సబ్సిడీని వర్తింపజేయనుంది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు , కర్నూలు , కడప , అనంతపురం జిల్లాల్లో రైతులకు సబ్సిడీ అందివ్వనుంది.



Next Story

Most Viewed