రోడ్డు బాగుచేయాలని విద్యార్థుల వినూత్న నిరసన.. ఫోటోలు వైరల్

by  |
రోడ్డు బాగుచేయాలని విద్యార్థుల వినూత్న నిరసన.. ఫోటోలు వైరల్
X

దిశ, గోదావరిఖని : గుంతల రోడ్డుతో తాము ఇబ్బందులు పడుతున్నామని రోడ్డును బాగు చేయాలని విద్యార్థులు విన్నూత నిరసన చేపట్టారు. ఎల్కలపల్లి గ్రామం నుండి గోదావరిఖని వైపు వచ్చే రోడ్డు గుంతలు గుంతలుగా మారడంతో పాఠశాలకు వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకొని రోడ్డును బాగు చేయాలని గుంతల రోడ్డుపై నమస్కారాలు చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలని వారు పేర్కొన్నారు. విద్యార్థులు చేసిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

శ్రీయుత గౌరవనీయులైన స్థానిక ప్రజాప్రతినిధులకు, మమ్మల్ని సన్మార్గంలో పయనింపచేసే విద్యావేత్తలకు మా నమస్కారములు. మీరు చూస్తున్న ఈ రోడ్డు ఎల్కలపల్లి గ్రామం నుండి గోదావరిఖని వెళ్లే ప్రధాన రహదారి. మేము చదువుకోవాలంటే మా గ్రామం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్ళాలి. మాకు బస్సు సౌకర్యం లేదు, సైకిల్‌పై లేదా కాలినడకన వెళ్దామన్నా మా రోడ్డు పరిస్థితి ఇలా ఉంది.

దయచేసి ప్రజల బాగోగులు చూసుకునే ప్రజాప్రతినిధులకు మాది ఒక్కటే విన్నపం. మాకు కనీస వసతులు కల్పించండి. మా గ్రామానికి మంచి రోడ్డు వసతి కల్పించి.. విద్యార్థిని, విద్యార్థులకు.. ప్రజల కోసం బస్సు సౌకర్యం కల్పించండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మా బంగారు భవిష్యత్తుకు మీ సహాయ సహకారాలు అందించండి. మమ్మల్ని సన్మార్గంలో పయనింపచేసేలా మీ వంతు కృషి చేయండి. మీరు ఎలాంటి మార్గమున నడిస్తే మేము కూడా అలాంటి దారిలోనే నడుస్తాము కదా, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కనీస వసతులు కల్పించండని విద్యార్ధులు కోరుతున్నారు.



Next Story

Most Viewed