భారీ బైబ్యాక్ ప్రకటించిన ఇన్ఫోసిస్

by  |
భారీ బైబ్యాక్ ప్రకటించిన ఇన్ఫోసిస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్‌ను బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ నెలలోనే ఈ షేర్ల బైబ్యాక్ కోసం సంస్థ బోర్డు డైరెక్టర్లు ఆమోదం ఇచ్చినప్పటికీ, ఈ నెల 19న సంస్థ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి మంజూరు అయింది. ఈ నెల 25న మొత్తం రూ. 9,200 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను నిర్వహించనున్నట్టు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బైబ్యాక్ ఆఫర్‌గా ఒక్కో షేర్‌కు గరిష్ఠగా రూ. 1,750కి కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. చివరి తేదీ ఈ ఏడాది డిసెంబర్ 24న గడువు ముగుస్తుందని కంపెనీ పేర్కొంది.

మొత్తం 5,25,71,428 ఈక్విటీ షేర్లను ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనుంది. ఈ భారీ మొత్తం షేర్ల బైబ్యాక్‌కు కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీనిని మేనేజర్‌గా నియమించినట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. జూన్ 19న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బైబ్యాక్ ఆఫర్ ప్రతిపాదనకు అనుకూలంగా 98.83 శాతం ఓట్లు వచ్చాయని కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed