జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభం

by  |
Jurala project
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణమ్మ జలాలు జూరాలకు చేరాయి. కొత్త నీటి సంవత్సరంలో ఈసారి ముందుగానే వరద ప్రవాహనం చేరింది. ఎగువ కర్ణాటకలోని పలు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి రిజర్వాయర్​కు వరద నీరు చేరుతోంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 3,568 క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదవుతోంది. ఎగువన అల్మట్టికి 1305 క్యూసెక్కులు వస్తుండగా… దిగువకు 2242 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక నారాయణపూర్​ డ్యాంకు 7069 క్యూసెక్కులు చేరుతుండగా… దిగువకు 1720 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

అయితే ఎగువన వర్షాలు, స్థానికంగా కురిసిన వానలతో నదిలో ప్రవాహం మొదలైంది. ఆదివారం ఉదయం జూరాలకు 3568 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రస్తుం జూరాలలో 1.366 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు ఎగువ కర్ణాటక, శివమొగ్గ, హవేరీ, రాణిబెన్నూర్​, హరిహర ప్రాంతాల్లో వర్షాలతో తుంగభద్రకు కూడా వరద మొదలైంది. ఆదివారం వరకు తుంగభద్రకు 25‌‌02 క్యూసెక్కులు చేరుతున్నాయి. మొన్నటి వరకు డెడ్​స్టోరేజీలో ఉన్న తుంగభద్ర ప్రస్తుతం 9 టీఎంసీల నిల్వకు చేరింది.

Next Story

Most Viewed