పడిలేచిన పారిశ్రామికోత్పత్తి

by  |
పడిలేచిన పారిశ్రామికోత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఆరు నెలల సంకోచం తర్వాత భారత పారిశ్రామికోత్పత్తి మొదటిసారిగా సానుకూలంగా నమోదైంది. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.2 శాతం సానుకూల వృద్ధి సాధించినట్టు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. ఆగష్టులో ఇది 8 శాతం ప్రతికూలంగా నమోదైంది. సెప్టెంబర్‌లో కీలకమైన విద్యుత్, మైనింగ్ రంగాలు పుంజుకోవడంతో ఐఐపీ మెరుగ్గా నమోదైంది.

అయితే, పారిశ్రామికోత్పత్తి మెరుగ్గా ఉన్నప్పటికీ కీలకమైన తయారీ రంగం 0.6 శాతం ప్రతికూలంగానే ఉంది. సెప్టెంబర్‌లో విద్యుత్ ఉత్పత్తి 4.9 శాతం, మైనింగ్ ఉత్పత్తి 1.4 శాతం పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో ఐఐపీ 4.6 శాతం కుదించుకుపోయిన సంగతి తెలిసిందే. పరిమిత సడలింపు, ఆర్థిక కార్యకలాపాల్లో మెరుగుదల నేపథ్యంలో ఐఐపీ సానుకూలంగా నమోదైనట్టు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.

Next Story

Most Viewed