ఇంద్ర (ఏసీ) బస్సులో మంటలు..

by  |
ఇంద్ర (ఏసీ) బస్సులో మంటలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడలో ఈరోజు ఉదయం ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర(ఏసీ) బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణీకులను కిందకు దించడంతో ఘోర ప్రమాదం నుండి సురక్షితంగా భయటపడ్డారు ప్రయాణీకులు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని బస్సులో మంటలను ఆర్పివేశారు.

ప్రమాదానికి గురైన బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్నట్టు సమాచారం. అయితే బస్టాండ్‌ సమీపంలోనే నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది.

Next Story

Most Viewed