12 ఏళ్ల తర్వాత క్లోజయిన మార్కెట్లు!

by  |
12 ఏళ్ల తర్వాత క్లోజయిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు కరోనా వైరస్ అంటుకుంది. గురువారం ఉదయం నుంచి మొదలైన భారీ పతనం శుక్రవారం పాతాళాన్ని దాటి అథఃపాతాళానికి కృంగిపోతోంది. దేశీయ మార్కెట్లను పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి తన పంజాను మరింత వేగంగా విసురుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 10 శాతం మేర నష్టపోవడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్‌ను క్లోజ్ చేశారు. సెబీ నిబంధనల ప్రకారం 10 శాతం నష్టాలు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉదయం సూచీలన్నీ భారీ నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 10 శాతం మేర నష్టపోవడంతో మార్కెట్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. అనంతరం మొదలైన మార్కెట్లు అదే నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు సెన్సెక్స్ 127.55 పాయింట్ల నష్టంతో 32,650 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 26.25 పాయింట్లను కోల్పోయి 9,563 వద్ద ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ సూచీలు లాభాల్లో కొనసాగుతుండగా, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు తగ్గి రూ. 74.44 వద్ద కొనసాగుతోంది.

tags : sensex, nifty, BSE, NSE, stock market, markets closed for 45min


Next Story

Most Viewed