రికవరీ దిశగా ఉత్పాదక రంగం : ఫిక్కీ!

by  |
రికవరీ దిశగా ఉత్పాదక రంగం : ఫిక్కీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉత్పాదక రంగం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కోలుకుందని, మునుపటి త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రికవరీ మెరుగైన స్థితిలో ఉందని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వెల్లడించింది. జూన్ త్రైమాసికానికి ఉత్పత్తి రంగంలో మెరుగైన పరిస్థితులు ఉండగా, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అధిక ఉత్పత్తి జరిగి 24 శాతానికి పెరిగిందని ఫిక్కీ పేర్కొంది. అయితే, ఈ రంగంలో ఉత్పత్తి పెరిగి, పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నప్పటికీ 80 శాతం వరకు కంపెనీలు రాబోయే మూడు నెలల్లో శ్రామిక శక్తిని తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి.

2020-21లో తొలి త్రైమాసికంతో పోలిస్తే నియామకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఇటీవల పరిణామాలను అనుసరించి 85 శాతం వరకు పరిశ్రమలు అదనపు శ్రామిక శక్తిని నియమించేందుకు ఆసక్తి చూపించడంలేదు’ అని ఫిక్కీ పేర్కొంది. వివిధ రంగాల్లోని అంచనాల ఆధారంగా వైద్య పరికరాలు మినహాయించి అన్ని రంగాల్లోనూ రెండో త్రైమాసికంలో తక్కువ వృద్ధిని నమోదు చేసే అవకాశముందని ఫిక్కీ తెలిపింది. ప్రధానంగా కొవిడ్-19 వ్యాప్తి సంబంధిత లాక్‌డౌన్ వల్ల డిమాండ్ తగ్గి, ఎగుమతులు పరిమితం చేయబడ్డంతో ఉత్పాదక రంగంలో ప్రతికూల అంశాలు ఇంకా కొనసాగుతున్నాయని ఫిక్కీ పేర్కొంది.

Next Story

Most Viewed