కరోనా ముందుస్థాయికి చేరుకున్న ఆభరణాల ఎగుమతులు!

by  |
కరోనా ముందుస్థాయికి చేరుకున్న ఆభరణాల ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకున్నాయని ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) శుక్రవారం తెలిపింది. అమెరికా లాంటి ప్రధాన మార్కెట్లలో థ్యాంక్స్ గివింగ్ డే నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగిందని, ఖర్చులు సుమారు 22 శాతం పెరిగాయని ఆభరణాల మండలి పేర్కొంది. అన్ని ప్రధాన ఎగుమతుల మార్కెట్లలో ఆభరణాల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

2020లో చైనాలో అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ ఉత్పత్తులో ఆభరణాలున్నాయి. అమెరికాలో పెరిగిన డిమాండ్ రికార్డు స్థాయిని తాకాయని జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ (ఐఐజేఎస్) రెండో ఎడిషన్ వర్చువల్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలను చూడగలుగుతామనే నమ్మకం ఉందని, ఇది వజ్రాలు, ఆభరణాల రంగం వృద్ధికి దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed