శాంసంగ్‌కు కలిసొచ్చిన పండుగ సీజన్

by  |
శాంసంగ్‌కు కలిసొచ్చిన పండుగ సీజన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ విభాగం అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల చూస్తున్నట్టు శాంసంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్ సానుకూలంగా ఉందని, టెలివిజన్లు(టీవీ), రీఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి వాటి వాటిలో కొత్త ఉత్పత్తులౌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.

‘పండుగ సీజన్ తర్వాత టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్, మైక్రోవోవెన్‌ల అమ్మకాలు 32 శాతం వృద్ధిని సాధించాయని, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదించుకుపోయినప్పటికీ, వేగంగా అమ్మకాల వృద్ధి నమోదవడం శుభవార్త లాంటిదని రాజు పుల్లన్ తెలిపారు. దేశీయంగా పండుగ సీజన్‌లో భారతీయులు ఎక్కువగా బంగారం నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్ లాంటి వాటికి అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ అమ్మకాలు అక్టోబర్‌లో ప్రారంభమై ఏడాది చివరి వరకు ఉంటుంది.

ఇదివరకు ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లోనే ఎక్కువగా అమ్మకాల వృద్ధి ఉన్నప్పటికీ, ఇప్పుడు చిన్న పట్టణాలు ఆ నగరాలను అధిగమించేసే స్థాయిలో వృద్ధిని సాధించడం విశేషం. శాంసంగ్ కస్టమర్ల ప్రవర్తనలో జరిగిన మార్పులను గమినిస్తోంది. ఖరీదైన, హై-ఎండ్ టీవీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా భారీ సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్ల విక్రయాలు కూడా పెరిగాయి. మొత్తమ్మీద లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం వృద్ధి నమోదైందని రాజు పుల్లన్ వెల్లడించారు.



Next Story

Most Viewed