ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన భారత రోయింగ్ జట్టు

by  |
ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన భారత రోయింగ్ జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : భారత రోయింగ్ జట్టు సభ్యులు అర్జున్ లాల్ జాట్, అర్వింద్ సింగ్ టోక్యో ఒలంపిక్స్ మెన్స్ లైట్ వెయిట్ డబుల్స్ ఈవెంట్‌కు అర్హత సాధించారు. టోక్యోలో శుక్రవారం జరిగిన ఆసియా ఓషియానా కాంటినెంటర్ అర్హత పోటీల ఫైనల్‌లో రెండో స్థానంలో నిలవడంతో వారు అర్హత సాధించారు. మెన్స్ సింగిల్స్‌లో మరో భారత రోయర్ జాకర్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే దేశానికి ఒకటే స్పాట్ ఉండటంతో అతడు ఒలంపిక్స్‌కు దూరమయ్యాడు. ఇక సెయిలింగ్‌లో అర్హత సాధించిన నెత్రా కుమనన్, విష్ణు శరవనన్, కేసీ గణపతి, వరుణ్ టక్కర్‌లను యూరోప్‌లో శిక్షణకు పంపించాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయించింది. ఈ నలుగురు సెయిలర్ల కోసం రూ. 73.14 లక్షల నిధులు విడుదల చేసింది. వీరందరూ త్వరలోనే బ్రిటన్ ప్రయాణం కానున్నారు.

Next Story