జగన్ సర్కార్‌కు షాక్..అవి నిలిపివేస్తామంటూ ఐఎండీ రెడ్ నోటీసు..

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ రెడ్‌ నోటీసులను జారీ చేసింది. మెడికల్‌ ఉపకరణాలను రాష్ట్రానికి సరఫరా నిలిపేయాలని శుక్రవారం ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎంఎస్‌ఐడీసీకి పరికరాలు ఎవరు సరఫరా చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపింది. బకాయి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని నోటీసులో పేర్కొంది.

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఏపీకి ఎవరైనా సరఫరా చేస్తే వారి సొంత రిస్క్‌ అని నోటీస్‌లో వివరించింది. ఏ సంస్థ అయినా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లలో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. బకాయిలు వంద శాతం చెల్లిస్తేనే పరికరాలు సరఫరా చేయాలని పరిశ్రమలకు సూచించింది. ఈ పరిణామాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే పాలు సరఫరా చేయలేమంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రూ.31కోట్లు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో అంగన్వాడీలకు సరఫరా చేసే పాలు వచ్చే నెల నుంచి నిలిపివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed