వ్యాక్సిన్‌ను నిరాకరించిన క్రికెటర్లు

by  |
వ్యాక్సిన్‌ను నిరాకరించిన క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లకు బీసీసీఐ కరోనా వ్యాక్సిన్స్ వేయించడానికి ప్రయత్నించినా.. క్రికెటర్లు నిరాకరించినట్లు తెలుస్తున్నది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్ల నిరాకరించారని.. టీకా తీసుకోవడం వల్ల జ్వరంతో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వాళ్లు ఆందోళన చెందారని తెలుస్తున్నది. అయితే విదేశీ క్రికెటర్లు, సిబ్బంది వ్యాక్సిన్ తీసుకుంటామని ముందుకు వచ్చారని.. కానీ విదేశీయులకు వ్యాక్సిన్ వేయడం నిబంధనలకు విరుద్దం కావడంతో ఆ ప్రయత్నం మానుకున్నట్లు సమాచారం. ‘ఆటగాళ్లకు కరోనా టీకా వేయించాలని అనుకున్నాము. అయితే చాలా మంది దానిపై అవగాహన లేక నిరాకరించారు.

కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఒప్పించినా.. మెజార్టీ క్రికెటర్లు మాత్రం అంగీకరించలేదు. బయోబబుల్‌లో ఉన్న మాకు కరోనా రాదని క్రికెటర్లు ధీమాగా ఉన్నారు. మరోవైపు టీకా వేయించుకుంటే జ్వరం వస్తుందనే ఆందోళన చెందారు. అందుకే కుదరలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడిన తర్వాత భారత క్రికెటర్లు వరుసగా వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. కోహ్లీ, రహానే, పంత్, బుమ్రా, ఇషాంత్ ఇప్పటికే కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. వీరిందరూ ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత అక్కడ సెకెండ్ డోస్ టీకా తీసుకోనున్నారు

Next Story

Most Viewed