కొలొంబోలో వార్‌ వన్‌ సైడ్.. దంచికొట్టిన టీమిండియా

by  |
కొలొంబోలో వార్‌ వన్‌ సైడ్.. దంచికొట్టిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: కొలొంబో వేదికగా జరిగిన ఇండియా vs శ్రీలంక మొదటి వన్డే మ్యాచ్‌లో ధావన్ సేన బోణీ కొట్టింది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 36.4 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ (86) పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాట్స్‌మాన్ ఇషాన్ కిషన్ (59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ పృథ్వీ షా (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో వచ్చిన మనీష్ పాండే (26) పరుగులు మాత్రమే చేసి అతడూ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మరో బ్యాట్స్‌మాన్ సూర్య కుమార్ యాదవ్ (31) రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి.. కెప్టెన్‌కు తోడుగా మ్యాచ్‌ విజయంతో తన వంతు కృషి చేశాడు. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 263 లక్ష్యాన్ని అవలీలగా చేధించింది.

శ్రీలంక ఇన్నింగ్స్..

నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేశారు లంకేయులు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దాసున్ షనకా టీమ్‌లో.. చమిక (43 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌‌గా నిలిచాడు. ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (32), మినోద్(27) పర్వాలేదనిపించారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాట్స్‌మాన్ రాజపక్స (24), ధనంజయ డిసిల్వా (14) చేతులెత్తేయగా.. మిడిలార్డర్లు అసలంక (38), దాసున్ షనక (39) పరుగులతో స్కోరు బోర్డును ముందుకుతీసుకెళ్లారు. 7వ స్థానంలో వచ్చిన హసనరంగ (8) పరుగులతో విఫలమవ్వగా.. చమిక (43 నాటౌట్)‌ జట్టును ఆదుకున్నాడు. ఇసుర ఉదాన (8), దుష్మంత చమీర (13) పరుగులు చేశారు. లక్ష్మణ్ సందకన్ బ్యాటింగ్ చేయాల్సి ఉండగానే నిర్ణీత ఓవర్లు ముగిశాయి. ఇదే సమయానికి లంకేయులు 262 పరుగులు చేశారు. ఇక 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగబోయే టీమిండియా ఏం చేయనుందో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed