ఇంగ్లండ్‌తో భారత్‌ సెమీస్‌ నేడు

by  |
ఇంగ్లండ్‌తో భారత్‌ సెమీస్‌ నేడు
X

టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళా జట్టు అదరగొడుతుంది. ఈ టోర్నమెంటు ఇప్పటివరకూ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను సైతం చిత్తు చేసి ఉత్సాహంతో విజయాలు సాధిస్తోంది. ఇదే ఉత్సాహంతో ఇంకో రెండు మ్యాచుల్లో కనబరిస్తే విశ్వవిజేత మనమే అవుతాం. నేడు భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు విజయం ఖారారయినట్టే అని చెప్పొచ్చు. అయితే ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించడం కూడా అంత సులభమేమీ కాదు. ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఇరుదేశాలల్లో ఇంత ఆసక్తి రేకెత్తించడానికి కారణం.. ప్రపంచ నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌వుమన్‌ వర్సెస్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ పోరాటమే. భారత చిచ్చరపిడుగు షఫాలీ వర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌నకు దూసుకుపోయింది. ఇంగ్లండ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ బౌలర్లలో అగ్రస్థానానికి చేరింది. రెండు జట్లు సెమీస్‌కు చేరడంలో ఈ మ్యాచ్‌లో వీరిద్దరిదీ చాలా కీలకమైన పాత్ర. సెమీఫైనల్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ గట్టి జట్టయినా ఈ ఊపులో మరో గెలుపు అందుకోవడం కష్టమేమీ కాదనిపిస్తోంది. తొలిసారి ఫైనల్‌ చేరాలన్న ఆకాంక్ష.. ఆపై ట్రోఫీతో చరిత్ర సృష్టించాలన్న పట్టుదల కలగలిసిన వేళ గురువారం జరిగే భారత వీరనారీలు సిద్ధమయ్యారు. అయితే సిడ్నీలో గురువారం జరిగే రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఫలితం రావాలంటే ఒక్కో జట్టు కనీసం ఐదు ఓవర్లకు తగ్గకుండా ఆడాలి. కానీ ఐసీసీ టోర్నీలకు నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఒక్కో జట్టు కనీసం 10ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అంటే.. సెమీస్‌లో ఫలితం రావాలంటే ఒక్కో మ్యాచ్‌ 20ఓవర్లు జరగాల్సి ఉంటుంది. అలాజరగకుంటే మ్యాచ్‌ రద్దవుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లూ రద్దయితే.. రెండు గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అంటే గ్రూప్‌ ‘ఏ’ టాపర్‌ భారత్‌, గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన సౌతాఫ్రికా ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి.

Tags: India, England, semi final, cricket match, t20 world cup



Next Story

Most Viewed