రెండో రోజు ఇంగ్లాండ్ స్కోర్ 555/8

by  |
రెండో రోజు ఇంగ్లాండ్ స్కోర్ 555/8
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో జో రూట్ సేన రెండో రోజు కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఇదే సమయంలో భారత బౌలర్లు కూడా పుంజుకున్నారు. ఓ వైపు జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగిన వేళ.. హార్డ్ హిట్టర్ బెన్ స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్‌ కనబరిచాడు. ఇక టీమిండియా బౌలర్లు కూడా సరైన సమయానికి వికెట్లు తీసుకుంది. దీంతో డే ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 555 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో డొమినిక్ బెస్ (28), జోఫ్రా ఆర్చర్(0) ఉన్నారు.

రెండో రోజు ఇన్నింగ్స్ సాగిందిలా..

తొలి రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భాగంగా 89.3 ఓవర్లకు ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇదే సమయంలో క్రీజులో జో రూట్ 128 పరుగులతో ఉండగా.. అతడికి తోడుగా బెన్ స్టోక్స్ వచ్చే సమయానికి డే ముగిసింది. ఇక రెండో రోజు కెప్టెన్ రూట్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మంచి ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఇదే సమయంలో భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన స్టోక్స్.. పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 387 పరుగుల వద్ద ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియాకు టైమ్ వచ్చినట్టు అయింది.

ఆ వికెట్‌తోనే ‘రూట్’‌ క్లియర్..

అప్పటికే సెంచరీ పూర్తి చేసుకొని డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న కెప్టెన్ జో రూట్ భారత ఆటగాళ్లకు సవాల్‌గా మారాడు. రెండో రోజు కూడా ధాటిగా రాణిస్తూ ఏకంగా 387 బంతులను ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో డబుల్ సెంచరీని పూర్తి చేసుకొని 218 పరుగులు చేశాడు. ఇక స్టోక్స్ వికెట్ తీసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా బౌలర్లు కూడా మరో వికెట్ పడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సరిగ్గా 473 స్కోర్ బోర్డు వద్ద ఇంగ్లాండ్‌ జట్టు ఓలీ పోప్‌ (ఐదో)వికెట్‌ను కోల్పోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న భారత బౌలర్లు ఎదురుదాడికి దిగి రూట్‌ను సైతం ఒత్తిడిలోకి నెట్టారు. ఇదే సమయంలో స్పిన్‌ను ఆయుధంగా మలిచిన నదీమ్.. 477 పరుగుల వద్ద జో రూట్‌ను LBWతో పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లాండ్‌ పరుగులకు బ్రేకులు పడ్డాయి.

ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (30), జోఫ్రా ఆర్చర్ డకౌట్‌తో వెనుదిరిగారు. ఇక డే ముగిసే సరికి క్రీజులో డొమినిక్ బెస్ (28), జాక్ లీచ్ (6) పరుగులు చేసి ఉన్నారు. ఇక తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ రేపు మళ్లీ కొనసాగనుంది.

స్కోర్ బోర్డు:

1. రోరీ బర్న్స్ c పంత్ b అశ్విన్ 33(60)

2. డొమినిక్ సిబ్లే lbw b బుమ్రా 87(286)

3. డానియెల్ లారెన్స్ lbw b బుమ్రా 0(5)

4. జో రూట్ (c)lbw b నదీమ్ 218(377)

5. బెన్ స్టోక్స్ c పుజారా b నదీమ్ 82(118)

6. ఓలీ పోప్ lbw b అశ్విన్ 34(89)

7. జోస్ బట్లర్ (wk)b ఇషాంత్ 30(51)

8. డొమినిక్ బెస్ batting 28(84)

9. జోఫ్రా ఆర్చర్ b ఇషాంత్ 0(1)

10. జాక్ లీచ్ batting 6(28)

ఎక్స్‌ట్రాస్: 37

మొత్తం స్కోరు: 555/8

వికెట్ల పతనం: 63-1 (రోరీ బర్న్స్, 23.5), 63-2 (డానియెల్ లారెన్స్, 25.4), 263-3 (డొమినిక్ సిబ్లే, 89.3), 387-4 (బెన్ స్టోక్స్, 126.1), 473-5 (ఓలీ పోప్, 152.2), 477-6 (జో రూట్, 153.6), 525-7 (జోస్ బట్లర్, 169.2), 525-8 (జోఫ్రా ఆర్చర్, 169.3).

బౌలింగ్:
1. ఇషాంత్ శర్మ 27-7-52-2

2. జస్ప్రీత్ బుమ్రా 31-4-81-2

3. రవిచంద్రన్ అశ్విన్ 50-5-132-2

4. షాబాజ్ నదీమ్ 44-4-167-2

5. వాషింగ్టన్ సుందర్ 26-2-98-0

6. రోహిత్ శర్మ 2-0-7-0

Next Story

Most Viewed