స్టార్టప్‌ల యుగంలో భారత్‌దే అగ్రస్థానం!

by  |
pm-modi
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఇప్పుడు స్టార్టప్‌ కంపెనీల యుగం నడుస్తోందని, దీనికి భారత్ నాయకత్వం వహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. భారత్‌లో సుమారు 70కి పైగా స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లను అధిగమించింది. దీంతో ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు.

యువతరం అధికంగా ఉన్న ఏ దేశంలోనైనా ఆలోచనలు- ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, చేయగలిగే స్పూర్తి కీలకమని మోదీ అన్నారు. ఈ మూడు అంశాలు ఒకచోట కలిస్తే అద్భుతమైన ఫలితాలను చూడగలమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది స్టార్టప్ కంపెనీల్లో రికార్డు స్థాయి పెట్టుబడులు కొనసాగుతున్నాయని, ఈ రంగం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. చిన్న నగరాలకు సైతం స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయి. ‘యూనికార్న్’ అనే మాట అతిపెద్ద చర్చనీయాంశ మైందన్నారు. 2015 వరకు దేశంలో 9-10 యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు యూనికార్న్‌లలో అగ్రస్థానంలో ఉన్నామని మోదీ తెలిపారు. ఈ ఏడాది అంతకుమించి కేవలం 10 నెలల్లో 10 యూనికార్న్‌లు వచ్చాయని, కరోనా పరిస్థితుల మధ్య యువత ఈ విజయం సాధించడం గొప్ప విషయమని వెల్లడించారు.

Next Story

Most Viewed