ఆ సమస్యలున్నా.. కరోనా టెస్టులు

by  |
ఆ సమస్యలున్నా.. కరోనా టెస్టులు
X

న్యూఢిల్లీ: భారత్ కరోనావైరస్ పరీక్షలు తక్కువగా చేపడుతున్నదని విమర్శలు వస్తున్నాయి. విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తేనే దేశం కరోనాను కట్టడి చేయగలుగుతుందని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనావైరస్ టెస్టులను విరివిగా చేపట్టేందుకు, టెస్టుల పరిధిని పెంచేందుకు నిర్ణయించుకుంది.

విదేశాలకు వెళ్లివచ్చి కరోనావైరస్ లక్షణాలు కనిపించినవారికి, వారితో కాంటాక్ట్‌లో ఉండి లక్షణాలు తేలినవారికి, చికిత్స చేసి కరోనా లక్షణాలు కనిపించినవారికి టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని మన దేశం అనుసరించింది. కానీ, ఇప్పుడు తీవ్రమైన దగ్గు, శ్వాససంబంధిత సమస్యలతో ఆస్పత్రి చేరినవారందరికీ, లక్షణాలు బయటికి కనిపించకున్నా వైరస్ కలిగి ఉన్నట్టు అనుమానమున్న వారికి, వైరస్ సోకినవారికి మొదటి ఐదు రోజుల నుంచి 14 రోజులలోపు కలిసినవారందిరికీ టెస్టులు నిర్వహించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. న్యూమోనియా పేషెంట్ల వివరాలను హాస్పిటళ్లు అందజేయాలని, తద్వారా వారికీ కరోనావైరస్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయంతో టెస్టులు నిర్వహించే పరిధి పెరిగి ఎక్కువ మందిని పరీక్షించవచ్చునని, తద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags : coronavirus, tests, pneumonia, respiratory problems, centre



Next Story

Most Viewed