55 ఏళ్ల తర్వాత అటువైపు ట్రైన్‌కు దారి

by  |
55 ఏళ్ల తర్వాత అటువైపు ట్రైన్‌కు దారి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, తూర్పు పాకిస్తాన్‌తో సంబంధాలు తెగిపోయిన సమయంలో(1965లో).. వెస్ట్ బెంగాల్‌ (హల్దిబరి) నుంచి బంగ్లాదేశ్‌ (చిలహటి) వరకు ఉండే రైల్వే రూట్ రద్దు చేయబడింది. ఆ రూట్‌ను 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రీ ఓపెన్ చేశారు. 33 బోగీలతో ఉన్న రైలును వర్చువల్ మీటింగ్‌లో భారత్, బంగ్లాదేశ్ ప్రారంభించాయి. కాగా ఈ రైల్వే లైన్‌ను పునరుద్ధరించడం పట్ల భారత్, బంగ్లాదేశ్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రైల్వే శాఖ మంత్రి నురుల్ ఇస్లాం సుజాన్ గురువారం చిలహటి రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ట్రైన్‌ను ప్రారంభించారు. ఈ రూట్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల (చికెన్స్ నెక్) గుండా పశ్చిమ బెంగాల్‌కు చేరుతుంది. తద్వారా ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్, భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ ఏర్పడటంతో పాటు వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతాయి. ఈ ఒక్క రూట్ ఓపెన్ కావడం ద్వారా ఇండియా- బంగ్లాదేశ్ మధ్య ఉన్న మరో నాలుగు లైన్లు ప్రారంభం కానున్నాయి. అవి పెట్రపోల్-బెనపోల్, జెడె-దర్శన, సింఘబాద్-రోహన్‌పుర్, రాధికాపూర్-బిరోల్.

Next Story

Most Viewed