ఎన్నికల ఫలితాలను ఆపండి

by  |
ఎన్నికల ఫలితాలను ఆపండి
X

దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్రం మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై కన్నేసింది. ఎన్నికల ఫలితాల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు ఆపాలంటూ కొందరు స్వతంత్ర అభ్యర్ధులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి శనివారం ఫిర్యాదు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నిలిపివేసి, జరిగిన లోపాలపై విచారణ జరిపించాలని స్వతంత్ర అభ్యర్ధులు కంటే సాయన్న, మోతే నరేష్, జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి లు రాష్ట్ర ఎన్నికల అధికారికి పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నాటి నుండి పోలింగ్ తేదీ (ఈ నెల 3)వరకు వివిధ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల అధికార స్థానిక యంత్రాంగం, మీడియాలో జరిగిన అవకతవకలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల పైన, అధికార దుర్వినియోగాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యం పై ప్రజలకు మరింత విశ్వాసం పెరగాలంటే ప్రస్తుతం దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కాగా దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed